సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 'కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్' పథకాలు పేదింటి ఆడబిడ్డ లకు ఓ వరమని, గత అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీ మేరకు
మహిళలకు తులం బంగారం కూడా వెంటనే అందజేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళ వారం మల్కాజిగిరి ఎమ్మార్వో సుజాత ఆధ్వర్యంలో ఆమె కార్యాలయం వద్ద ఎమ్మె ల్యే, 49 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేద కుటుం బాలకు ఓ వరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు అవుతుంది..పెళ్లి సమయం లో ఆడబిడ్డకు ఇస్తానన్న తులం బంగారం నేటికీ ఇవ్వడం లేదు.ఎప్పుడు ఇస్తారో ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సకాలంలో ఇది వారికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసుతో ఆలోచించి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేశారని , కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని కొనసాగిస్తుండటం అభినందనీయమని ,అయితే ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం కూడా ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే ప్రస్తావించగానే మహిళలు చప్పట్లు కొట్టారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు, త్వరితగతిన విచారణ పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చెక్కులు పంపిణీ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించా రు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాల ఫలాలు పేదలకు అందేలా అధి కారులు బాధ్యతతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, మోనార్ భాగ్యానంద్ రావు, అమీనుద్దీన్, మండలి చిన్నయాదవ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, హేమంత్ పటేల్, మాశెట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు.