యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్
యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ లాడ్జిలలో మంగళవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జిల్లోని రికార్డులు, నిర్వహణ తీరును పరిశీలించారు. లాడ్జి యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీఐ భాస్కర్ సూచించారు.
లాడ్జిలలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన గుర్తింపు పత్రాలు లేకుండా నిర్వహించే లాడ్జిలపై, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని లాడ్జిలపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి లాడ్జి యజమాని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎస్సైలు యాదయ్య, ప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.