BREAKING
గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం

రెబల్ అభ్యర్థి వేముల శారదా ను గెలిపించండి. ఎమ్మెల్యే.

Select Suryaa Now
రెబల్ అభ్యర్థి వేముల శారదా ను గెలిపించండి. ఎమ్మెల్యే.

కంబదూరు: కంబదూరు మండల జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వేముల శారద చుట్టూ రాజకీయ చర్చ వేడెక్కుతోంది. ఆమె టెంకాయ గుర్తుపై పోటీ చేస్తుండగా, గెలుపొందితే ఆ విజయాన్ని జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందిస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కంబదూరు జడ్పీటీసీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల శారద విజయం సాధిస్తే ఆ గెలుపును పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ విజయంగా భావిస్తామని స్పష్టం చేశారు. టెంకాయ గుర్తుపై పోటీ చేస్తున్న వేముల శారదను అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆ విజయాన్ని పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందించడమే తన ప్రధాన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం సాగిస్తున్న వేముల శారదకు కూటమి రాజకీయ వర్గాల నుంచి మద్దతు లభించే అవకాశాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే స్వయంగా ఆమె విజయాన్ని పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందిస్తామని ప్రకటించడంతో కంబదూరు జడ్పీటీసీ ఎన్నికల పోరుకు మరింత రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు వేముల శారద స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల బరిలో కొనసాగుతున్నారు. ఆమెకు ఎమ్మెల్యే మద్దతు ప్రకటించినట్లు వ్యాఖ్యలు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా అధికారిక మద్దతు, స్థానిక కూటమి నాయకుల వైఖరి వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఒకవైపు స్వతంత్ర అభ్యర్థిగా తన గుర్తింపుతో ప్రజల్లోకి వెళ్తున్న వేముల శారదకు మరోవైపు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయ బలాన్ని చేకూర్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కంబదూరు మండలంలో జడ్పీటీసీ ఎన్నికల పోరు ఇప్పటికే ఆసక్తికరంగా మారగా, తాజా రాజకీయ పరిణామాలు ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఎమ్మెల్యే అమిలినేని వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య రాజకీయ అవగాహనకు సంకేతమా? లేక స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని జనసేన పార్టీకి అంకితం చేసే వ్యూహమా? అన్న ప్రశ్నలు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా టెంకాయ గుర్తుపై పోటీ చేస్తున్న వేముల శారద గెలుపు, ఎమ్మెల్యే అమిలినేని మద్దతు వ్యాఖ్యలు కంబదూరు జడ్పీటీసీ ఎన్నికల్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.