వర్షపు నీటిలో మునిగిన హైస్కూల్.. రంగంలోకి దిగిన ఎంపిడిఓ.. మమత
అంబాజీపేటమేజర్ న్యూస్ ;తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అంబాజీపేట హైస్కూల్ చుట్టూ పూర్తిగా నీట మునిగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ హైస్కూల్‌లో నాలుగు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఓటర్లు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలలో భాగంగా మునిగిన జెడ్పి హైస్కూల్ లో నీరు తొలగింపు చర్యలలో అధికారులు అప్రమత్తమయ్యారు. అంబాజీపేట మండల ప్రజా పరిషత్ ఎంపీడీవో భి.మమత, డిప్యూటీ ఎంపీడీవోలు కంచి శ్రీనివాస్, ఎండి అబ్బాస్ అలీ, మాచవరం పంచాయతీ కార్యదర్శి కె. సత్యనారాయణమూర్తి దగ్గరుండి పాఠశాలలో నిలిచిపోయిన వర్షపు నీటి తొలగింపు చర్యలు చేపట్టారు.పోలింగ్ బూత్‌లకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో మమత తెలిపారు.