BREAKING
తుఫాన్ బీభత్సం.. కుప్పకూలిన రిటైనింగ్ వాల్! మూడు ఇళ్లకు నష్టం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్షం అడ్డొచ్చినా.. ప్రచారంలో వెనకడుగు లేదు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గిరిజాల బాబు దంపతుల పాదయాత్ర పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రెబల్ అభ్యర్థి వేముల శారదా ను గెలిపించండి. ఎమ్మెల్యే. జిల్లా సాయికి 40 మంది ఎంపిక పండుటాకులు కథ వృద్ధాప్యంలోనూ వసంతం రష్మిక మందన్నను వైల్డ్ అంటూ విజయ్ దేవరకొండ ప్రశంసలు: గాయాలపాలైనా కష్టపడిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షపు నీటిలో మునిగిన హైస్కూల్.. రంగంలోకి దిగిన ఎంపిడిఓ.. మమత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే బండారు షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి అనిరుధ్ తప్పుకోవడం అప్పుడే జరిగిందా.. ఎడ్ షీరన్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన అసలు నిజం! ముమ్మిడివరం నగర పంచాయతీలొ కూటమి జోరు.. 23వార్డుల విజేతలు వీరే.. దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చెత్త *నేరేడుచర్ల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేదా? ఉన్నతాధికారుల అనుమతితోనే మున్సిపాలిటీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడుతున్నారా యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్ 105 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.

కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో.

Select Suryaa Now
కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో.

కంబదూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం కంబదూరు మండల కేంద్రంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. చెక్‌పోస్టు సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత పోస్టాఫీస్, పాత బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలారి సాయి హర్ష హాజరయ్యారు. రోడ్‌షోలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు, నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల జడ్పీటీసీ అభ్యర్థి నూతిమడుగు అరుణ, ఎంపీటీసీ అభ్యర్థులు శకుంతలమ్మ, అమృత, దాదు, గాజుల రామాంజనేయులు ఓటర్లను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రోడ్‌షోతో ఎన్నికల ప్రచార వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.