బొంపెల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. - 42 బైక్‌లు, 2 ఆటోలు సీజ్
సూర్య - పెద్దపల్లి రూరల్ :
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల గుర్తింపే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారుల నుంచి వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 42 మోటార్ సైకిళ్లు, రెండు 42ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మధుకర్, పెద్దపల్లి టౌన్ ఎస్ఐ రాజశేఖర్, ఎస్ఐ-2 శ్వేత, ఎస్ఐ-2 నరేష్, సర్పంచ్ మౌనిక సంతోష్, ఉప సర్పంచ్ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.