ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. 44 వార్డులకు గాను 40 వార్డులు కూటమి కౌన్సిల్ అభ్యర్థులు గెలుపొందగా.. ఇద్దరు వైసిపి, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత తన సమీప ప్రత్యర్థి డాక్టర్ కె ఎస్ రఘు పై 22,777 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మరో ఆరు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు చైర్మన్ రైస్ లో ఉండగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహమ్మద్ 3వేల 4 వందల పైచిలుకు ఓట్లు సాధించారు..
చేనేతపురం ఎమ్మిగనూరు పురపాలకము టిడిపి జనసేన, బిజెపి, కలిసి కైవసం చేసుకున్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా