చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్
సూర్య-పెద్దపల్లి: బాలల సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లో కేడర్ పాఠశాల, బాలల సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, ఐసీపీఎస్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పులు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, భద్రత కల్పించాలని, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అధికారులు తరచూ కేంద్రాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ రమేష్, సీడీపీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.