BREAKING
యానిమేషన్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు

మానవత్వం చాటుకున్న మానవత స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు

Select Suryaa Now
మానవత్వం చాటుకున్న మానవత స్వచ్ఛంద సేవ సంస్థ  సభ్యులు

పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక నిడుబ్రోలు జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకున్న ప్రజలకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, పొన్నూరు శాఖ ఆధ్వర్యంలో  మంగళవారం  సహాయక చర్యలు చేపట్టారు.పునరావాస కేంద్రంలో ఉన్న సుమారు 200 మంది ప్రజలకు సంస్థ సభ్యులు టీ, బ్రెడ్ మరియు బిస్కెట్లను పంపిణీ చేశారు. ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అల్పాహారం అందించడం పట్ల  పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  ముప్పాళ్ళ రమేష్ బాబు , తుఫాను ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్  సత్యనారాయణ , పొన్నూరు తహసిల్దార్  మహమ్మద్ జియా ఉల్ హుక్ , టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కిషోర్ బాబు , మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పొన్నూరు శాఖ ప్రెసిడెంట్ యారసాని వెంకటేశ్వర్లు, సెక్రటరీ బాలకృష్ణతో పాటు సభ్యులు కరిముల్లా, సుబ్రహ్మణ్యం, రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 పొన్నూరు దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్