ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
గజ్వేల్ ;.తెలంగాణ రాష్ట్రంలో ఎల్ని నో ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని తీవ్రంగా ఉన్నట్టుగా ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక హామీలను ఎగ్గొట్టి, తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే పంటలు వేయొద్దని నీటి కొరత ఉంటుందని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నాడని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యదర్శి కొట్టాల యాదగిరి విమర్శించారు. మంగళవారం నాడు స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిజంగా ఎల్ నినో ప్రభావం ఉన్నట్లయితే గజ్వేల్ నియోజకవర్గ ప్రాంతాన్ని కరువు మండలాలుగా ఎందుకు గుర్తించలేదు ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏ రాష్ట్రంలో లేని ప్రభావం తెలంగాణలో అత్యధికంగా ఉన్నట్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అంటడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు కొనలేక తినలేక అల్లాడిపోతున్నారని అధికారంలో ఉన్న మీరు ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక చేయకపోవడం వల్లనే పరిస్థితులు ఇలా ఉన్నాయని ఇది కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు భరోసా ఇచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండి నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించకపోతే ఆకలి చావులు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలపై నియంత్రణ చర్యలు చేపట్టకపోతే ప్రజల పక్షాన పోరాడుతామని ప్రజల కొరకు పోరాటం చేయడానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎడ్ల నరసింహులు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లింగని రాజు, కనకరాజు పాల్గొన్నారు.