BREAKING
వర్షం అడ్డొచ్చినా.. ప్రచారంలో వెనకడుగు లేదు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గిరిజాల బాబు దంపతుల పాదయాత్ర పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రెబల్ అభ్యర్థి వేముల శారదా ను గెలిపించండి. ఎమ్మెల్యే. జిల్లా సాయికి 40 మంది ఎంపిక పండుటాకులు కథ వృద్ధాప్యంలోనూ వసంతం రష్మిక మందన్నను వైల్డ్ అంటూ విజయ్ దేవరకొండ ప్రశంసలు: గాయాలపాలైనా కష్టపడిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షపు నీటిలో మునిగిన హైస్కూల్.. రంగంలోకి దిగిన ఎంపిడిఓ.. మమత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే బండారు షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి అనిరుధ్ తప్పుకోవడం అప్పుడే జరిగిందా.. ఎడ్ షీరన్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన అసలు నిజం! ముమ్మిడివరం నగర పంచాయతీలొ కూటమి జోరు.. 23వార్డుల విజేతలు వీరే.. దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చెత్త *నేరేడుచర్ల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేదా? ఉన్నతాధికారుల అనుమతితోనే మున్సిపాలిటీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడుతున్నారా యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్ 105 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. గెలుపే లక్ష్యంగా జడ్పిటిసి అభ్యర్థి శ్రీధర్ విస్తృత ప్రచారం మహిళలు, యువత ప్రచారంలో పాల్గొని మద్దతు

నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం

Select Suryaa Now
నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం

నెల్లిమర్ల, సూర్య : జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ రేపిన నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. కూటమి అభ్యర్థుల జోరును తట్టుకుంటూ, స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి లెంక అప్పలనాయుడు సమీప కూటమి బీజేపీ చైర్మన్ అభ్యర్థి మైపాడ ప్రసాద్‌పై 3,598 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
​లెంక అప్పలనాయుడు (స్వతంత్ర అభ్యర్థి): 7,605 ఓట్లు (విజేత)
​మైపాడ ప్రసాద్ (కూటమి బీజేపీ అభ్యర్థి): 4,007 ఓట్లు
​సముద్రపు రామారావు (వైసీపీ అభ్యర్థి): 3,056 ఓట్లు
​కనకల పద్మనాభం (కాంగ్రెస్ అభ్యర్థి): 71 ఓట్లు సాధించారు. 
​మొత్తం 23 వార్డులలో
​తెలుగుదేశం పార్టీ  10 స్థానాలు
​జనసేన పార్టీ 5 స్థానాలు
​వైసీపీ 2 స్థానాలు
​స్వతంత్రులు 6 స్థానాలను కైవశం చేసుకున్నాయి.
​1వ వార్డు: కొత్తల ధనలక్ష్మి (జనసేన)
​2వ వార్డు: కాళ్ల బంగారమ్మ (టీడీపీ)
​3వ వార్డు: ఆల్తి పద్మావతి (టీడీపీ)
​4వ వార్డు: నడిపేన నారాయణరావు (స్వతంత్ర)
​5వ వార్డు: బంగారు భాను ప్రకాష్ (జనసేన)
​6వ వార్డు: రవ్వా అమూల్య రాణి (జనసేన)
​7వ వార్డు: బయిరెడ్డి పూర్ణ (టీడీపీ)
​8వ వార్డు: చందక దేవి (టీడీపీ)
​9వ వార్డు: కలిశెట్టి కన్నంనాయుడు (టీడీపీ)
​10వ వార్డు: రెడ్డి వెంకట గురునాయుడు (టీడీపీ)
​11వ వార్డు: పంచాది రమణమ్మ (టీడీపీ)
​12వ వార్డు: బేపల తులసి (టీడీపీ)
​13వ వార్డు: పాలవలస అప్పలనారాయణ (జనసేన)
​14వ వార్డు: కొండేటి చైతన్య కుమార్ (స్వతంత్ర)
​15వ వార్డు: సారిపల్లి అప్పారావు (జనసేన)
​16వ వార్డు: ముడిమంచి లక్ష్మి (టీడీపీ)
​17వ వార్డు: మజ్జి ఆదినారాయణ (టీడీపీ)
​18వ వార్డు: గంటా గౌరి (వైసీపీ)
​19వ వార్డు: కల్యాణపు మేనక (స్వతంత్ర)
​20వ వార్డు: పోలుబోతు నారాయణమూర్తి (వైసీపీ)
​21వ వార్డు: నల్లి బంగారు చంద్రశేఖరరావు (స్వతంత్ర)
​22వ వార్డు: కాళ్ల హేమంత్ కుమార్ (స్వతంత్ర)
​23వ వార్డు: మద్దిల శ్రీను (స్వతంత్ర) గెలుపొందారు.

​అభివృద్ధే నా మొదటి ప్రాధాన్యత - చైర్మన్ లెంక అప్పలనాయుడు

​గెలుపు అనంతరం నూతన చైర్మన్ లెంక అప్పలనాయుడు మాట్లాడుతూ.. నెల్లిమర్లను అన్ని విధాలుగా ఒక మోడల్ నగరపంచాయతీగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి సర్దుబాటులో భాగంగా తనకు చైర్మన్ సీటు కేటాయించలేదని, నెల్లిమర్ల టీడీపీకి కంచుకోట అని గుర్తుచేశారు. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూనే, వారి ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించానని తెలిపారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.