బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలి.
- బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పి యాదయ్య.
కొందుర్గు (రంగారెడ్డి): బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని రామచంద్రపూర్ లో కొందుర్గ్, జల్లేడు - చౌదరిగూడ మండలాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ భారతదేశంలో 50 శాతం ఉన్న బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. జన కుల గణన చేపట్టి బీసీ లందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతరం కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, మండలాల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు . కొందుర్గు మండల నూతన కమిటీ అధ్యక్షులుగా సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా యాదమ్మ, ప్రధాన కార్యదర్శిగా భూపాల్ , సహాయ కార్యదర్శిగా ఎం మల్లేష్, కోశాధికారిగా సి సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అలాగే చౌదరి గూడ మండల నూతన కమిటీ అధ్యక్షులుగా ఎస్ భాస్కర్ ఉపాధ్యక్షులుగా యాదయ్య ప్రధాన కార్యదర్శిగా కే బాలరాజ్ సహాయ కార్యదర్శిగా వీరేశం కోశాధికారిగా కే మల్లేష్ ల ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, కొందుర్గు జిల్లేడు చౌదరిగూడ మండలాల సిపిఐ కార్యదర్శులు బాగల నరసింహ, జిల్లాల వెంకటేష్ , శంకరయ్య, వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈ సత్యనారాయణ, మేజర్ న్యూస్.