BREAKING
అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక సీపీఎస్‌ఈ ఆస్తుల విక్రయంతో రూ.15,000 కోట్లు! త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’ దేశీయ మార్కెట్లో పెరిగిన ఉక్కు ధరలు ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి డిస్కో శాంతి: బుల్లెట్ మూవీతో అరంగేట్రం

బంజారాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి -10 కోట్లతో హథిరాం బావాజీ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి - మఠం ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బంజారా నాయకుల వినతి

Select Suryaa Now
బంజారాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి  -10 కోట్లతో హథిరాం బావాజీ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి - మఠం ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి  గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బంజారా నాయకుల వినతి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాష్ట్రంలోని బంజారా గిరిజన సమాజ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు బుధవారం బంజారా నాయకులు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ను రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బంజారా సమాజానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ప్రధానంగా ఆరాధ్య దైవం శ్రీస్వామి బాలాజీ హథిరాం బావాజీ ఆలయ అభివృద్ధి, మఠ ఆస్తుల పరిరక్షణ, తండాల అభివృద్ధి అంశాలపై చర్చించారు. శ్రీస్వామి బాలాజీ హథిరాం బావాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బుక్యా శివ నాయక్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

10 కోట్లతో హథిరాం బావాజీ ఆలయం నిర్మాణం 

విద్యుత్ నగర్, వేదాంతపురంలో నిర్మాణంలో ఉన్న శ్రీస్వామి బాలాజీ హథిరాం బావాజీ ఆలయం బంజారా సమాజానికి ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించాలని కోరారు.

జీవసమాధి దినోత్సవానికి అధికారిక గుర్తింపు

హథిరాం బావాజీ జీవసమాధి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేక దినంగా ప్రకటించి, ఆ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ ప్రాతినిధ్యం, భూ కేటాయింపు

రాజధాని అమరావతి ప్రాంతంలో బంజారా సమాజ భవన నిర్మాణం కోసం 20 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. బంజారా సమాజానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించాలని, పార్లమెంట్, శాసనసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. 

బంజారా తండాలకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక

రాష్ట్రంలోని బంజారా తండాల్లో ఇప్పటికీ అనేక మౌలిక సదుపాయాల కొరత ఉందని వివరించారు. అవికే నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 15 సంవత్సరాల క్రితం కూలిపోయిన బ్రిడ్జిని తిరిగి నిర్మించాలి. దీనివల్ల పలు తండాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. రాష్ట్రంలోని అన్ని బంజారా తండాలను ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కిందకు తీసుకురావాలి.తండా రాజ్ వ్యవస్థ ద్వారా స్థానిక ప్రజలకు పరిపాలనా, అభివృద్ధి అవకాశాలు కల్పించాలి. ప్రతి తండాకు రహదారులు, మొబైల్ నెట్‌వర్క్, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలి.

హథిరాం బావాజీ మఠం ఆస్తుల పరిరక్షణ

తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న శ్రీహథిరాం బావాజీ మఠానికి సంబంధించిన వందల కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర పరిశీలన జరిపి, చట్టప్రకారం మఠానికి చెందాల్సిన ఆస్తులను తిరిగి మఠం ఆధీనంలోకి తీసుకురావాలి. ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందులో బంజారా ప్రతినిధులకు చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

సేవాలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణం

బంజారా సమాజ ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని తిరుమల పరిసర ప్రాంతంలో ప్రతిష్ఠించేందుకు అనుమతులు ఇవ్వాలి. రాష్ట్రంలోని ప్రతి బంజారా తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ బంజారా సేవాదళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రాథోడ్ మాట్లాడుతూ, బంజారా సమాజ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హథిరాం బావాజీ ఆలయ నిర్మాణం పూర్తయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బంజారా సోదరులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. బంజారా సమాజం తరఫున సమర్పించిన సమస్యలను గవర్నర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్‌కు బుక్యా శివ నాయక్ బంజారా సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవాదళ్ గౌరవ అధ్యక్షులు రామచంద్ర రాథోడ్, మార్కెట్ చైర్మన్ రఘురాం రాథోడ్, అధ్యక్షులు, అధ్యాపకులు అజయ్ నాయక్, జటావత్ బాలాజీ, విజయవాడకు చెందిన పలువురు బంజారా నాయకులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్