andhrapradesh
కార్పొరేటర్ కాకి గంగరాజు ఘనవిజయం
- నన్ను గెలిపించిన ప్రజలందరూ ధన్యవాదాలు
ఆరిలోవ, సూర్య: జీవీఎంసీ,14వ వార్డు కార్పొరేటర్‌గా కూటమి అభ్యర్థి కాకి గంగరాజు 8,312 ఓట్ల అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించిన సందర్భంగా 14వ వార్డులో విజయోత్సవ యాత్ర అత్యంత వైభవంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పెద్ద సంఖ్యలో పాల్గొని జరుపుకున్నారు. ప్రజలు పూలమాలలు వేసి, హారతులు ఇచ్చి నూతన కార్పొరేటర్ కాకి గంగరాజుకు ఘన స్వాగతం పలికారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కాకి గంగరాజు ధన్యవాదాలు తెలియజేశారు.