BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

Select Suryaa Now
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

 

ఎన్నికలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం.
- ఎస్పీ తుహిన్ సిన్హా.

అనకాపల్లి, నవంబర్ 3, మేజర్ న్యూస్: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం వహించవద్దని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ (జూమ్) ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి ఎన్నికల బందోబస్తు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ప్రాంతంలో శాంతిభద్రతలను నిరంతరం సమీక్షించాలి. రెగ్యులర్ పోలీసులతో పాటు ఎన్ఎస్ఎస్, మహిళా పోలీసులు, రిటైర్డ్ పోలీసు అధికారుల సేవలను వినియోగించుకోవాలి. సిబ్బందికి వాహనాలు, వసతులు ముందస్తుగా సిద్ధం చేయాలి. ఎన్నికలకు ఆటంకం కలిగించే అనుమానితులు, ట్రబుల్ మాంగర్లను గుర్తించి బైండోవర్ చేయాలి. ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రతి స్టేషన్ పరిధిలో మైకులు, సైరన్లను వినియోగించాలి. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సిబ్బందికి స్పష్టమైన బ్రీఫింగ్ ఇవ్వాలి. అన్ని రూట్లలో మొబైల్ టీమ్స్ నిరంతర పెట్రోలింగ్ చేయాలి. అనకాపల్లి, పాయకరావుపేట వంటి మేజర్ మండలాల్లో అదనపు స్ట్రైకింగ్ ఫోర్సులను సిద్ధంగా ఉంచాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి. అనుమతి లేని విజయోత్సవ ర్యాలీలపై నిఘా ఉంచాలి. పోలింగ్ ముగిసి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అధికారులు, సిబ్బంది ఆయా స్టేషన్ల పరిధిలోనే అందుబాటులో ఉండాలి. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు.