BREAKING
అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక సీపీఎస్‌ఈ ఆస్తుల విక్రయంతో రూ.15,000 కోట్లు! త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’ దేశీయ మార్కెట్లో పెరిగిన ఉక్కు ధరలు ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి డిస్కో శాంతి: బుల్లెట్ మూవీతో అరంగేట్రం

ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎమ్మెల్యే

Select Suryaa Now
ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎమ్మెల్యే

*కళ్యాణదుర్గం:** మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అందించిన ఘన విజయం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి 11,576 ఓట్లతో ఘన విజయం సాధించడంతో పాటు, మొత్తం 28 మంది కూటమి కౌన్సిలర్లు విజయం సాధించడం ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు అపూర్వమైనదని, ఈ విజయం కార్యకర్తలు, నాయకులు, కూటమి శ్రేణుల సమష్టి కృషి ఫలితమని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి గొడవలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం సంతోషకరమన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటర్లు తమ తీర్పును వెల్లడించారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రధాన లక్ష్యమని, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు సత్తా చాటుతారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు జడ్పీటీసీ స్థానాలతో పాటు 64 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కంబదూరు మండలంలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల శారద విజయం సాధించినప్పటికీ, ఆమె జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేస్తూ జనసేన ఖాతాలోనే ఆ విజయాన్ని చేరుస్తారని వ్యాఖ్యానించారు. టెంకాయ గుర్తుపై పోటీ చేస్తున్న వేముల శారదను గెలిపించి ఆ విజయాన్ని పవన్ కల్యాణ్‌కు కానుకగా అందిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలే తగిన తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మీడియా ప్రతినిధులు ఎంతో శ్రమించి విధులు నిర్వహించారని, వారి కష్టాన్ని గుర్తించామని ఎమ్మెల్యే తెలిపారు. మీడియా మిత్రుల సమస్యలు, వారి కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.