బేతంచెర్లలో వైసీపీ జయభేరి
బేతంచర్ల :నంద్యాల జిల్లా బేతంచెర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీ, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది.
మొత్తం వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు 18 స్థానాల్లో ఘన విజయాన్ని సాధించగా, ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 10 వార్డులకే పరిమితమైంది. వార్డుల్లో తిరుగులేని ఆధిక్యం సాధించడంతో పాటు, వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దస్తగిరి తన సమీప ప్రత్యర్థిపై 600కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని మెజారిటీ వార్డులను దక్కించుకోవడంతో బేతంచెర్లలో వైసీపీ శ్రేణులు, నాయకులు మరియు మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. పటాకులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ విజయ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.