BREAKING
అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక సీపీఎస్‌ఈ ఆస్తుల విక్రయంతో రూ.15,000 కోట్లు! త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’ దేశీయ మార్కెట్లో పెరిగిన ఉక్కు ధరలు ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి డిస్కో శాంతి: బుల్లెట్ మూవీతో అరంగేట్రం

ముంచేసిన మురసు తుఫాన్.. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు.

Select Suryaa Now
ముంచేసిన మురసు తుఫాన్.. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు.

అనపర్తి, మేజర్ న్యూస్:అర్నబ్ తుఫాన్ సృష్టించిన నష్టం నుంచి కోలుకోకముందే మురసు తుఫాన్ రైతాంగాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. వరుస తుఫాన్లు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ రూపంలో విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట కోతకు సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షాల కారణంగా పొలాల్లోకి వెళ్లి కోతలు కోసే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే అనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగి, పొలాల్లో నీరు నిలిచిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట నీటిలో నానిపోవడంతో అనేక ప్రాంతాల్లో ధాన్యం మొలకెత్తింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

ఈ నష్టం నుంచి బయటపడకముందే మురసు తుఫాన్ ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురవడం రైతుల పరిస్థితిని మరింత దిగజార్చింది. సాధారణంగా వరి పంట కోతకు వచ్చిన సమయంలో రైతులు యంత్రాల సహాయంతో ధాన్యాన్ని త్వరగా ఒబ్బిడి చేసుకుంటారు. అయితే వరుస వర్షాల కారణంగా చేలల్లో నీరు నిలిచిపోవడం, నేల బురదమయంగా మారడంతో హార్వెస్టర్ యంత్రాలు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నేలకొరిగిన వరి కంకులు నీటిలో మునిగిపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే కోసి పొలాల్లో ఆరబెట్టిన ధాన్యం సైతం వర్షపు నీటికి తడిసిపోయింది. దీంతో రైతులకు పంటను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు మురసు తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలు మిగిలిన పంటను కూడా దెబ్బతీస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో పెట్టుబడులు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు అన్నీ భారంగా మారగా, దిగుబడి చేతికి అందకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. వరుస తుఫాన్లతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 గ్రామాల వారీగా పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర సర్వే నిర్వహించాలని, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పంటల బీమా పరిహారాన్ని త్వరితగతిన అందించడంతో పాటు రైతులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆశిస్తున్నారు.