telangana
నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ
సూర్య, మాక్లూర్ ;;రాబోయే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ఎస్. నాగరాజు సూచించారు. ఆయన ఆధ్వర్యంలో మాక్లూర్ గ్రామపంచాయతీ పరిధిలో జిల్లాలోని మిషన్ భగీరథ ఏఈలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీల పరిధిలో తాగునీటి సరఫరాకు వినియోగించే బోర్లలో నీటి మట్టాన్ని ఎలా కొలవాలి, నీటి వినియోగం అనంతరం నీటి మట్టంలో వచ్చే మార్పులను ఎలా అంచనా వేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని, నీటి వనరులను సంరక్షించడంతో పాటు ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చర్చించారు.
ఈ కార్యక్రమంలో మాక్లూర్ గ్రామ సర్పంచ్ సాయినేని వెంకటేశ్వర్ రావు, ఆర్మూర్ డీఎల్‌పీవో శివకృష్ణ, మాక్లూర్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వివిధ మండలాల ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.