BREAKING
పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ! పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం

విజయం చేకూర్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు - డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా

Select Suryaa Now
విజయం చేకూర్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు - డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ గా తనకు అఖండ విజయం చేకూర్చిన మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలని తెలుగుదేశం తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పేర్కొన్నారు.ఆమె విజయం సాధించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు ఈ అవకాశం కల్పించేందుకు కృషిచేసిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి,తన విజయం కోసం కృషి చేసిన తెలుగుదేశం,బిజెపి,జనసేన నాయకులకు కార్యకర్తలకు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలని డాక్టర్ షకీలా పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి, సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు. తాను మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండదండలతో ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కరిస్తానని ప్రజలకు తన వంతు సేవలు అందిస్తానని తాను అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా కొనసాగిస్తానని డాక్టర్ షకీలా పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ షకీలా తనయుడు యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.