ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని.
కళ్యాణదుర్గం: నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఐదు మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల స్థానంలో తానే ఉన్నానని భావించి ఓటు వేయాలని ఆయన కోరారు. గత రెండున్నరేళ్లుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని అన్నారు. కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే ప్రభుత్వ సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.