telangana
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు, ఎంపిక ప్రక్రియలో పాల్గొననున్న కామారెడ్డి జిల్లా పోలీస్ క్రికెట్ జట్టు క్రీడాకారులకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, క్రికెట్ జెర్సీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విధి నిర్వహణలో నిరంతరం పని ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు ఒత్తిడిని అధిగమించేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు.అదేవిధంగా యువత మత్తు పదార్థాలు, ధూమపానానికి దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంపొందించు