రాఘవపూర్ శివారులో గంజాయి పట్టివేత.. - నిందితుడిపై కేసు నమోదు
సూర్య - పెద్దపల్లి రూరల్ :
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివారులో గంజాయి విక్రయించేందుకు వచ్చిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని అతని వద్ద నుంచి 1 కిలో 161 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి రూరల్ ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవపూర్ శివారులోని ఎల్‌ఎంఎన్ బిక్స్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద గంజాయి లభించడంతో విచారణ చేపట్టగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన పాకాల లోకేష్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి 1 కిలో 161 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు రూ.58,050 ఉంటుందని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.