జాయ్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
జిన్నారం:విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్ ను పెంపొందించడంతో పాటు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జాయ్ స్కూల్‌లో బుధవారం రోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా ట్రాఫిక్ అంశాలను నిర్వహించారు. సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో
రహదారి ప్రమాదాలకు సంబంధించిన వాస్తవ సంఘటనలను ప్రత్యక్ష దృశ్యాల ద్వారా చూపిస్తూ, రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయాలపై ట్రైనింగ్ బృందం విద్యార్థులకు అవగాహన కల్పించింది.ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రహదారి భద్రత పట్ల అవగాహన లేకపోవడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు వివరించారు. పాదచారుల భద్రత, రహదారిపై అప్రమత్తత, సురక్షిత ప్రయాణం, ట్రాఫిక్ నియమాల పాటింపు వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు రహదారి భద్రతకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు, తమ జీవితాల్లోనూ, సమాజంలోనూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ కి, ఆయన బృంద సభ్యులు మల్లేశ్వర్, నవీన్, శివకుమార్ లకు జాయ్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం కూడా విద్యలో ముఖ్యమైన భాగమని జాయ్ స్కూల్ డైరెక్టర్ పేర్కొన్నారు.