BREAKING
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి

ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి

Select Suryaa Now
ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి

విజయవాడ మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని 992 పోలింగ్ కేంద్రాల్లో 5,200 మందికి పైగా ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించగా, సమస్యాత్మక కేంద్రాలతో పాటు మొత్తం 496 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీటీవీల ద్వారా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పర్యటించి బోడపాడు, వెలగలేరు, పుల్లూరు, పరిటాల, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నున్న మండలం బోడపాడు ఆర్సీఎం పాఠశాల కేంద్రంలో ఓటర్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఓటర్లకు తాగునీరు, నీడ, క్యూలైన్లతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కూడా ఓటర్లకు సహకరించారు. మైలవరం మండలం పొందుగుల శివారు అనంతవరం పోలింగ్ కేంద్రంలో 84 ఏళ్ల గిరిజన మహిళ బాణావతు జంకా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ముగిసింది. అనంతరం బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ చేసి, భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన సిబ్బంది, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు, ఓటర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.