ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్సీ) చైర్‌పర్సన్‌గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీఓ ఎంఎస్ నంబర్ 87 ద్వారా ఆయనను చైర్‌పర్సన్‌గా నియమించగా, విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన బినోయ్ కుమార్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, ఏఈవో రమేష్ బాబు దర్శన ఏర్పాట్లు చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.