అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అన్నదానం ట్రస్ట్‌కు గురువారం విరాళం అందింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన గజానన్ ఈ-స్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని ఇంద్రకీలాద్రిపై దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వీకరించారు. అనంతరం దాతలకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.