BREAKING
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి

లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Select Suryaa Now
లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని వివిధ లీజులు, లైసెన్సులు, భక్తులకు కల్పిస్తున్న సేవా సౌకర్యాలపై గురువారం పరిపాలనా భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంబంధిత విభాగాల అధికారులు రంగారావు, లక్ష్మీ ప్రసన్న, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవస్థాన పరిధిలోని లీజుదారులు, లైసెన్సుదారులు ఆలయ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. దుకాణాలు, సేవా కేంద్రాల్లో భక్తులకు నాణ్యమైన సేవలను నిర్ణీత ధరలకే అందించాలని, అధిక ధరలు వసూలు చేయకుండా అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ లీజుల రుసుముల వసూలులో నిర్లక్ష్యం చేయకుండా బకాయిలను సకాలంలో వసూలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల లగేజీ కేంద్రాలు, చెప్పుల భద్రతా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రానున్న కార్తీక మాసం, భవానీ దీక్షల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల పనితీరును మెరుగుపరచాలని, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తికరమైన ఆధ్యాత్మిక అనుభూతితో తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.