BREAKING
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి

అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు

Select Suryaa Now
అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై భక్తులకు నిరంతరం అందించే అన్నప్రసాదం నాణ్యత, తయారీ విధానం, పంపిణీ ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేవస్థానం నియమించిన ప్రత్యేక కమిటీ అభిప్రాయాలపై గురువారం ఉదయం ఈవో ఛాంబర్‌లో కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరే కృష్ణ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) హరి, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం విభాగాల అధికారులు సుధారాణి, చంద్రశేఖర్, ఏఈవో రమేష్ బాబు, ఈఈ రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్. రంగారావు పాల్గొన్నారు. హరే కృష్ణ ఫౌండేషన్ అక్షయ పాత్ర విభాగం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విధానాలను సమావేశంలో చర్చించారు. అదే తరహాలో ఇంద్రకీలాద్రికి నిత్యం వచ్చే వేలాది మంది భక్తులకు స్వచ్ఛమైన, రుచికరమైన వేడి అన్నప్రసాదాన్ని వేగంగా అందించేందుకు అధునాతన యంత్రాల వినియోగం, వంటశాల ఆధునీకరణ, పంపిణీ వ్యవస్థల నిర్వహణపై కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రసాద తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, వంటశాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రద్దీ సమయాల్లో క్యూలైన్లలోని భక్తులకు సైతం సత్వరమే వేడి అన్నప్రసాదం అందేలా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అన్నప్రసాదం తయారీకి అవుతున్న ఖర్చుతో పాటు ఆధునిక వంటశాలలో అయ్యే వ్యయాన్ని బేరీజు వేసి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.