BREAKING
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి

గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

విజయవాడ మేజర్ న్యూస్ : బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ శాఖ మేనేజర్ గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌరోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సమాఖ్య తాత్కాలిక కమిటీ ఛైర్మన్ మేడవరపు లక్ష్మణరావు, గౌరవాధ్యక్షుడు యామిజాల నరసింహమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపినట్లు తెలిపారు. శ్రీనివాస్ మరణ వాంగ్మూలంలో ప్రస్తావించిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరపాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విధుల నుంచి తప్పించి విచారణ పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్‌ను పదవి నుంచి తొలగించాలని, సీఈవో గుళ్లపల్లి నాగసాయిపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీనివాస్ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు రూ.5 కోట్ల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారిక ప్రకటన చేయకపోతే బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో అమరావతిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించినట్లు తెలిపారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.