BREAKING
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి

Select Suryaa Now
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి

ఉయ్యూరు మేజర్ న్యూస్ : ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించిన చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ దంపతులను వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ దంపతులను శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తన రాజకీయ గురువు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ అని, రాజకీయాల్లో తొలి అడుగుల నుంచి ఆయన వద్దే ఓనమాలు నేర్చుకున్నానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి సందర్భంలోనూ తనకు మార్గదర్శనం చేస్తూ ప్రోత్సహించిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తూ ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ దంపతులను రాజేంద్రప్రసాద్ దంపతులు శాలువాతో సత్కరించి అభినందించారు. చైర్మన్ పదవి కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత అని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కౌన్సిలర్ల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబ, ప్రవీణ్ కుమార్ సతీమణి చెదుర్తిపాటి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.