క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం
సైబరాబాద్,మేజర్ న్యూస్ : హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన క్యూర్ (CURE) ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యూర్ చట్టం అమలు, క్యూర్ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి, వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఏజెన్సీల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించారు. చట్టం అమలులో భాగంగా చేపట్టాల్సిన చర్యలు, ఆయా శాఖల బాధ్యతలు, పరస్పర సహకారంపై సమావేశంలో సమీక్షించారు.వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.