ఘనంగా చందానగర్ లైట్‌హౌస్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు
చందానగర్,మేజర్ న్యూస్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహిస్తున్న చందానగర్ లైట్‌హౌస్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, లైట్‌హౌస్ జాతీయ విస్తరణ విభాగం అధిపతి అతుల్, తెలంగాణ విస్తరణ విభాగం అధిపతి ఆకుల శ్రీనివాస్‌తో పాటు చందానగర్ లైట్‌హౌస్ బృంద సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో లైట్‌హౌస్ అందిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. శిక్షణతో పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేపడుతున్న ఉద్యోగ అనుసంధాన కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు 1,500 మందికి పైగా యువత ఉపాధి పొందడం అభినందనీయమని పేర్కొన్నారు.యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వారిని స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు లైట్‌హౌస్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. గత నాలుగేళ్లుగా యువత సాధికారతే లక్ష్యంగా నిరంతరం సేవలందిస్తున్న లైట్‌హౌస్ బృంద సభ్యులను ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంలో లైట్‌హౌస్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.