ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
ఆకస్మికంగా సందర్శించిన డిఈఓ మరియు ఎంఈఓ గవర్నమెంట్ పిఎస్ పోలీస్ లైన్ స్కూల్ మరియు గవర్నమెంట్ పోలీస్ లైన్ హైస్కూల్
ఈ సందర్భంగా రెండు పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్(PTM) సమావేశానికి హాజరై డిఈ వో ఐ.విజయ కుమారి మాట్లాడుతూ ,విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రతిరోజు తప్పనిసరిగా పాఠశాలకు తమ పిల్లలను పంపించాలని అన్నారు.పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని అదేవిధంగా మీ పిల్లల యొక్క ప్రగతి తెలుసుకోవాలని కోరారు .ఎఫ్ ఎల్ ఎన్ లో పిల్లలకు చతుర్విధ ప్రక్రియలైన కూడిక,తీసివేత ,గుణకారము ,భాగహారం మరియు తెలుగు చదవడం, ఇంగ్లీషు చదవడం రావాలని ఇంటిదగ్గర కూడా తల్లిదండ్రులు విద్యార్థులను సాయంకాలము ఒక గంట రెండు గంటలు కూర్చోబెట్టి చదివించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందుతుందని అదేవిధంగా బ్రేక్ ఫాస్ట్ మరియు షూ బెల్టు, టైలు ,సాక్సులు రెండు జతల యూనిఫాములు మధ్యాహ్న భోజనము ,ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇలా అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని కనుక ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చదివించి మంచి ప్రయోజకులుగా చేయాలని తెలియజేస్తూ అదే విధంగా మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించడం జరిగింది .వంట వాళ్లను శుచి,శుభ్రతతో ఉండాలని ఎప్పటికప్పుడు నూనెలు మిగతా పలు రకాల వంట సామాగ్రి శుభ్రంగా ఉంచుకోవాలని వంటవారు కూడా శుభ్రంగా ఉండాలని తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొమారుత్.
ఎం.ఓం ప్రకాష్ ..మహబూబ్ నగర్