ప్లాస్టిక్ వినియోగంపై అధికారుల కొరడా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు
మియాపూర్,మేజర్ న్యూస్ : మియాపూర్ సర్కిల్ పరిధిలోని డీప్తిశ్రీనగర్ రోడ్డుపై డిసి శ్రీనివాస్ ఆధ్వరంలో పారిశుద్ధ్య అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న పలువురు వ్యాపారులపై జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగించవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.