విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి రూ . కోట్లు కేటాయింపు -బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మెన్ కుందారపు గణేష్ చారి హర్షం
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్ల కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వి హనుమంతరావు, కి ప్రిన్సిపల్ సెక్రెటరీ లకు బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మెన్ విశ్వబ్రాహ్మణ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు గణేష్ చారి కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్బంగా కుందారం గణేష్ చారి మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రం విశ్వబ్రాహ్మణుల కోసం ఐదు ఎకరాల స్థలం ఐదు కోట్ల రూపాయలతో ఇప్పటివరకు దాదాపు రెండు కోట్లతో భవనం నిర్మించుకున్నాము ఈ ఐదు కోట్ల రూపాయల భవనం మరి పిల్లల హాస్టల్ ఫెసిలిటీస్ కమ్యూనిటీ హాల్ ముఖ్యమైన బిల్డింగ్ కడతామని పేర్కొన్నారు.గురువారం ఉదయం 10 గంటలకు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారి నివాస ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణులకు రిలీజ్ ఆర్డర్ను కమిటీ చైర్మన్ లాల్కోట వెంకటాచారి ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందర,వైస్ చైర్మన్ లు కుందారం గణేష్ చారి వేములవాడ మదన్ వడ్ల అనుమానాలు కమిటీ సభ్యులు ఎర్రోజు వేణు బలవంత చారి పులివెందుల యాదగిరి పులి శ్రీనివాస్ చారి సంఘ బీసీ నాయకులు వలబోజూనరసింహాచారి అనంత బ్రహ్మచారి తదితరులు అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.