BREAKING
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం పియర్ పండ్లు రోజూ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా: ఆరోగ్య నిపుణుల సలహాలు ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శ్రీకారం పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేసిన చైర్మన్ గూడూరి శ్రీనివాస్ మొక్కజొన్న గింజలు జీర్ణక్రియకు ఎంతగానో మేలు చేస్తాయా: ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు అంగన్వాడీ లో మరుగు దొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన *పనులు ప్రారంబించిన సర్పంచ్ సందీప్, అధికారులు విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి రూ . కోట్లు కేటాయింపు -బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మెన్ కుందారపు గణేష్ చారి హర్షం క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎల్ నినో ప్రభావం.. రైతులకు తీరని నష్టం! మహాకాళి చిత్రం నుంచి ఆధ్యాత్మిక భక్తి గీతం విడుదల: ఐగిరి నందిని సాంగ్‌తో ప్రచార పర్వం షురూ ఘనంగా చందానగర్ లైట్‌హౌస్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ప్లాస్టిక్‌ వినియోగంపై అధికారుల కొరడా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు భువనగిరిలో బాబా చికెన్ మార్కెట్ ప్రారంభం*

పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేసిన చైర్మన్ గూడూరి శ్రీనివాస్

Select Suryaa Now
పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేసిన చైర్మన్ గూడూరి శ్రీనివాస్

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తూజీవో నంబర్ 24 జారీ చేసింది.ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ పద్మశాలి కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ మాత్యులు పొన్నం ప్రభాకర్‌ లకు చైర్మన్ గూడూరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలోని పద్మశాలి సామాజిక వర్గానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న  కల నర్సవీరిందన్నారు. పద్మశాలి సమాజం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామ పరిధిలో పద్మశాలి ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో నంబర్ 24, జారీ చేయడం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ చొరవ, సహకారం మరియు ప్రభుత్వ సానుకూల నిర్ణయం ఫలితంగా ఈ కీలకమైన ఉత్తర్వులు వెలువడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 కోట్లతో పద్మశాలి ఆత్మగౌరవ భవనాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించనున్నారు. ఈ భవనంలో విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించి, పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధంగా అందించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భవనం పద్మశాలి సామాజిక వర్గానికి ఒక ఆత్మగౌరవ ప్రతీకగా నిలవడంతో పాటు, సమాజ అభివృద్ధి, విద్యార్థులు, యువత, మహిళలు, చేనేత కార్మికులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు మరియు సామాజిక సంస్థల కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైన ముందడుగు అని  గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

 ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, తెలంగాణ సీనియర్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు – బీసీ సంక్షేమం మరియు అభివృద్ధి వి. హనుమంతరావు, మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఐఏఎస్ సంబంధిత అధికారులకు మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కుల బంధావులకు, నాయకులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.  పద్మశాలి సమాజ అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరంతరం కృషి చేస్తుందని చైర్మన్  గూడూరి శ్రీనివాస్ తెలిపారు.