ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శ్రీకారం
సనత్‌నగర్,మేజర్ న్యూస్:సనత్‌నగర్ డివిజనులోని టిఆర్టీ 1171లో ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి.మాజీ మంత్రి,సనత్‌నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గదర్శనంలో నిర్మాణ పనులు సాగుతున్నాయి.ఈ మేరకు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కోలన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పనులకు గురువారం శ్రీకారం చుట్టారు.పాఠశాలను నిర్వహిస్తున్న పాడుబడిన భవనాన్ని కూల్చివేశారు.దాని స్థానంలో నూతన భవన నిర్మాణానికి పనులను చేపట్టారు.ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షితమైన,ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమన్నారు.వారికి మెరుగైన వసతులను కల్పించేందుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి చేస్తున్నారని వివరించారు.ఎమ్మెల్యే చొరవ పట్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ప్రతినిధి అయ్యన్న,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రాహ్మచారి,బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.