భువనగిరిలో బాబా చికెన్ మార్కెట్ ప్రారంభం*
*ప్రారంభించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఓవైస్ చిష్తీ, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణిరవికుమార్*
*భువనగిరి, ప్రతినిధి మేజర్ న్యూస్*
పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘బాబా చికెన్ మార్కెట్’ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఓవైస్ చిష్తీ, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి రవికుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటవడం శుభపరిణామమన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఆదరణ పొందాలని నిర్వాహకులకు ఆకాంక్షించారు.ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు 35 శాతం ప్రత్యేక రాయితీ అందిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దుకాణ యజమానులు అబ్దుల్ మన్నాన్, మహమ్మద్ గౌస్, మహమ్మద్ షానూర్ అతిథులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ అజీముద్దీన్, కౌన్సిలర్లు స్వర్ణలత, మజహర్ బబ్లూ, బుర్హాన్, మహమ్మద్ షరీఫ్, మహమ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు*