మిర్యాలగూడలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు
వై జంక్షన్ ఇక హనుమాన్ జంక్షన్
మిర్యాలగూడ,మేజర్ న్యూస్ :
మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్ గా పిలువబడే కూడలి ఇక నుంచి హనుమాన్ జంక్షన్ గా పిలువబడనుంది. ఇక్కడ నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి నూతన ఆలయ విగ్రహ, శిఖర, ఏకశిలా ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవానికి సుముహూర్తం ఖరారైంది.
2026 నవంబర్ 27, 28, 29 తేదీలలో ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహ ప్రతిష్ఠలు జరుపనున్నారు. 54 అడుగుల ఎత్తు గల ఆంజనేయుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
గురువారం ఆలయ నిర్మాణకమిటీ అధ్యక్షులు, మాజీ పురపాలక సంఘ అధ్యక్షులు తిరునగరు భార్గవ్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగినఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అభయాంజనేయ స్వామి పతాకాన్ని, కరపత్రాలను, గోడ పత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలపై అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటివరకు ఉన్న వై జంక్షన్ పేరును హనుమాన్ జంక్షన్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్, పొదిల శ్రీనివాస్,రైస్ మిల్లర్ల సంఘ నాయకులు కర్నాటి రమేష్, గౌరు శ్రీనివాస్,డా.బండారు కుశలయ్య, గందె రాము, అల్లాని రమేష్, రేపాల రమేష్, పలువురు ఆధ్యాత్మిక సేవకులు తదితరులు పాల్గొన్నారు.