ఆధ్యాత్మిక చింతనకు ఆలయాలు కేంద్రాలు – నల్లగుట్టలో ముత్యాలమ్మ ఆలయ పునఃప్రారంభం
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : దేవాలయాలు ఆధ్యాత్మిక చింతన కేంద్రాలు అని, వాటిని పరిరక్షించుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం రాంగోపాల్ పేట డివిజన్ లోని నల్లగుట్ట C లైన్ లో పునర్నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ, ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, రాం మోహన్ యాదవ్, కొండాపురం మహేష్ యాదవ్, సతీష్, అరుణ్ భట్, చంద్ర ప్రకాష్, నిర్వాహకులు రాజేందర్, నర్సింగ రావు, మహేష్, కళ్యాణ్, రాకేష్, నవీన్, వినయ్ తదితరులు ఉన్నారు.