గోపీనగర్ పోస్ట్ ఆఫీస్ స్థలంపై విచారణ జరపాలి.. ఆక్రమణ ఆరోపణలపై స్పందించాలి.. అధికారులకు స్థానికుల విజ్ఞప్తి
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : గోపీనగర్‌లో పోస్ట్ ఆఫీస్ కు సంబంధించినదిగా భావిస్తున్న స్థలం ఆక్రమణకు గురైందనే ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సదరు స్థలం ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా? అనే విషయాన్ని అధికారిక భూ రికార్డులు, సర్వే వివరాల ఆధారంగా స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రభుత్వ స్థలమని తేలితే ఆక్రమణల నుంచి కాపాడాలని, ప్రైవేటు స్థలమైతే యజమానుల హక్కులను పరిరక్షించాలని పేర్కొంటున్నారు. రెవెన్యూ, పోస్టల్ శాఖ అధికారులు స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.గోపీనగర్, బాపునగర్, నెహ్రూనగర్ కాలనీల నాయకులు, పాత్రికేయ మిత్రులు ఈ అంశంపై దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం అందరూ శాంతియుతంగా, చట్టబద్ధంగా ముందుకు రావాలని కోరుతున్నారు.