ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్‌లో వరద నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రూ.3.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలా విస్తరణ, స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. తారానగర్ ముస్లిం స్మశాన వాటిక నుంచి లింగంపల్లి విలేజ్ మెయిన్ రోడ్డులోని సెవెన్ హిల్స్ బిల్డింగ్ వరకు చేపట్టనున్న పనులపై సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్‌లతో చర్చించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.అనంతరం లింగంపల్లి , వెంకట్ రెడ్డి కాలనీ వాసులు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, జయంత్ కుమార్, SLVDC అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, అజీమ్, కృష్ణ, సురేష్ రాథోడ్, అందెల కిరణ్, రఘు యాదవ్, భరత్ గౌడ్, రేవంత్, ఈశ్వర్, స్థానికులు పాల్గొన్నారు.