ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం
పాలమూరు మేజర్ న్యూస్ -
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు TGTET CBT మాక్ టెస్ట్ ప్రాక్టీస్‌కు అవకాశం – సద్వినియోగం చేసుకోవాలి: ఎ ఎం ఓ శ్రీనివాస్
గురువారం పీఎంశ్రీ షాసబ్ గుట్ట సెంటర్ ను పరిశీలించిన AMO దుంకుడు శ్రీనివాస్. మాక్ టెస్ట్ కి హాజరైన ఉపాధ్యాయుల తో మాట్లాడారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో TGTET In-Service Teachers – 2026-II పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సౌకర్యార్థం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంపై అవగాహన, ప్రాక్టీస్ కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 నవంబర్ 5 నుండి 10వ తేదీ వరకు మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఈ మాక్ టెస్ట్ కోసం జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
1) ZPHS, భూత్పూర్
2) ZPHS, జడ్చర్ల
3) ZPHS (Girls), దేవరకద్ర
4) Government High School, షాషాబ్ గుట్ట
5) KGBV, మహబూబ్‌నగర్ అర్బన్.
పై ఐదు కేంద్రాలలో ఏదైనా ఒక కేంద్రాన్ని సందర్శించి మాక్ టెస్ట్ రాసుకోవచ్చు.
ఈ మాక్ టెస్ట్ https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంపై పూర్తి అవగాహన పొందడానికి, కంప్యూటర్ వినియోగంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, అసలు పరీక్షకు ముందుగానే తగిన ప్రాక్టీస్ పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. కావున అర్హులైన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి దుంకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు.
గమనిక:—
1) ఈ మాక్ టెస్ట్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఎలాంటి OD (Official Duty) సౌకర్యం కల్పించబడదు. కావున ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి, తమ వ్యక్తిగత సౌలభ్యం మేరకు మాక్ టెస్ట్‌కు హాజరుకావాలని సూచించడమైనది.
2) ఉపాధ్యాయులు తమకు కేటాయించిన కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.
ఎం.ఓం ప్రకాష్ ..మహబూబ్ నగర్ ..