స్త్రీనిధి రుణాల బకాయిలు చెల్లించాలి...…
మద్దూర్;స్త్రీ నిధి రుణాల బకాయిలు వెంటనే చెల్లించాలని స్త్రీ నిధి సిద్దిపేట జిల్లా రీజినల్ మేనేజర్ దూదిపాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల కేంద్రంలోని జాగృతి మండల సమైక్య కార్యాలయంలో వివో ఏ లతో స్త్రీ నిధి రుణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీ నిధి రుణాల బకాయిలు సరిగా వసూలు జరగడం లేదన్నారు. గతంలో మహిళా సంఘాలకు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా అందులో కేవలం 70 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయని మిగతా 2.30 కోట్ల నిధులు బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. మారుమూల మండలమైన మద్దూరులో స్త్రీ నిధి రుణాలు ఎక్కువ శాతం మంజూరు అయినట్లు తెలిపారు. దీంతో మండలంలో చాలా సంఘాలకు తిరిగి రుణాలు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది అన్నారు. రుణాల రికవరీ కోసం మండల స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు వేసి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మద్దూరు మండలానికి ఒక కోటి రూపాయల స్త్రీ నిధి రుణాలు మంజూరయ్యాయని అన్నారు. ఈ మంజూరైన రుణాలు అర్హత కలిగిన సంఘాల సభ్యులకు మాత్రమే రుణాలు అందించనున్నట్లు వివరించారు. పెండింగ్లో ఉన్న రుణాలను త్వరితగతిన రికవరీ చేయించాలని ఆదేశించారు. ఈ ఏపిఎం ఖాత ప్రకాశం, సీసీలు కనక చంద్రం, సాయిలు, సుమలత, శ్రీనిధి మేనేజర్లు సునీత, స్వప్న, పాండు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.