అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ
కొల్చారం;కొల్చారం మండలంలోని అంసాన్ పల్లి గ్రామంలో ఆవులు, దూడలు, గేదెలకు నట్టల నివారణ మందులు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఆదిత్య వర్మ ఆధ్వర్యంలో పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ మందులు పశువుల ఆరోగ్యం, ఎదుగుదలకు, పాల దిగుబడి పెరగడానికి ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా పశు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ వీరేశం, ఓ యం యాదగిరి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ చెన్నయ్య, మైపాల్, రైతులు పాల్గొన్నారు.