సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని పోతంశెట్టిపల్లి ప్రధాన రహదారిపై ప్రజలకు సైబర్ నేరాల పట్ల కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ఆర్థిక మోసాల ఉచ్చులో పడకూడదని సూచించారు. సోషల్ మీడియాలో సైబర్ భద్రతకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలోని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లాగిన్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అలాగే బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.