BREAKING
మెడ దగ్గర వాపు కనిపిస్తోందా? గాయిటర్ సమస్య సంకేతం కావచ్చు.. కారణాలు ఇవే! గల్లంతయిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం... ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రిటెన్షన్‌పై ఫుల్ క్లారిటీ! ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం డయాబెటిస్ వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? రెటీనా సమస్యలపై వైద్య నిపుణుల హెచ్చరిక! సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి..! రామ్ చరణ్ – సుకుమార్ ‘RC17’ బడ్జెట్ రూ.400 కోట్లు? ఇండియన్ బాక్సాఫీస్‌పై మరో సంచలనం! చలికాలంలో చర్మం పగలకుండా మెరిసిపోవాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి! బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు!

వేంసూరు రైతులకు సాగు నీటి వరం

Select Suryaa Now
వేంసూరు రైతులకు సాగు నీటి వరం

ఎన్టీఆర్ కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్

సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
( కిరణ్ కుమార్ ఆరిక)

సత్తుపల్లి నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించే దిశగా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ఎన్టీఆర్ కాలువ ద్వారా వేంసూరు మండలానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వేంసూరు వద్ద ఎన్టీఆర్ కాలువలో ప్రవహిస్తున్న జలాలకు పసుపు, కుంకుమ జల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో నీటి విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సాగునీరు రైతాంగానికి ఎంతో కీలకమని, సమయానికి నీరు అందితే పంటలు సమృద్ధిగా పండడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ఆమె రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమ్సూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు...