పంప్ హౌస్ ను పరిశీలించిన నవీన్ మిట్టల్
కుకునూరుపల్లి;మండల పరిధిలోని తిప్పారం గ్రామంలో మల్లన్నసాగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న పంప్ హౌస్ ను ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఆకుల భద్రప్ప ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అలాగే మల్లన్న సాగర్ కట్టపైనుండి ర్యాంపు నిర్మాణ పనులు చేపట్టాలి గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్ట పైనుండి ర్యాంపు నిర్మాణ పనులుపై కానుకూలంగా స్పందించారని స్థానిక సర్పంచ్ ఆకుల భద్రప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వేణుగోపాలరావు ఎంపీడీవో మహబూబ్ అలీ సర్పంచ్ ఆకుల భద్రప్ప ఉప సర్పంచ్ ఈసాల నవీన్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.