మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ...…
మద్దూర్;దూల్మిట్ట మండలంలోని బెక్కల్ గ్రామానికి మంజూరైన మహిళా సమైక్య భవనాలు మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ నల్లగొప్పుల రేణుక రాములు గౌడ్ బుధవారం ముగ్గు పోసి నిర్మాణ పనులకు భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం మహిళా భవనాలు నిర్మాణం చేపట్టుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ జి మోహన్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు, వివో అధ్యక్షులు, ఫీల్డ్ సహాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.